నన్ను బెదిరించి క్షమాపణలు చెప్పించలేరు: కమల్‌ హాసన్‌ | Kamal Haasan refuses to apologise for saying Kannada born out of Tamil | Sakshi
Sakshi News home page

నన్ను బెదిరించి క్షమాపణలు చెప్పించలేరు: కమల్‌ హాసన్‌

May 30 2025 1:56 PM | Updated on May 30 2025 3:25 PM

Kamal Haasan refuses to apologise for saying Kannada born out of Tamil

ఢిల్లీ: కన్నడ భాష వివాదంపై ప్రముఖ నటుడు కమల హాసన్‌ స్పందించారు. కన్నడ భాష వివాదంపై క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. నన్ను బెదిరించి క్షమాపణ చెప్పించలేరు. కన్నడపై నా ప్రేమ నిజం. అజెండా ఉన్నవారికి మాత్రమే నా మాటలపై అభ్యంతరం’ అని వ్యాఖ్యానించారు.

కన్నడ సినిమాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలనే డిమాండ్లను కమల్ హాసన్ శుక్రవారం తోసిపుచ్చారు. తాను తప్పు చేసి ఉంటేనే క్షమాపణ చెబుతానని, ప్రస్తుత వివాదం అలాంటి కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తన జీవన విధానం. దీనిలో ఇతరులు జోక్యం చేసుకోవద్దని కోరారు.

తప్పు చేస్తే నేనే క్షమాపణ చెబుతాను. నేను తప్పు చేయకపోతే క్షమాపణ చెప్పను. ఇది నా జీవనశైలి. దయచేసి దాన్ని చెడగొట్టకండి. మనదేశం ప్రజాస్వామ్య దేశం. నేను చట్టం. న్యాయాన్ని నమ్ముతాను’ అని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement