
కమల్‌హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. ‘నాయగన్’ (1987) వంటి హిట్ మూవీ తర్వాత 38 సంవత్సరాలకు వీరి కాంబినేషన్‌లో వస్తున్న ద్వితీయ చిత్రమిది. శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యా లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
కమల్‌హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతదర్శకుడిగా, రవి కె. చంద్రన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.