ఫొటో సెషన్‌ను వాయిదా వేసిన రజినీ | Rajinikanth photo session postponed | Sakshi
Sakshi News home page

ఫొటో సెషన్‌ను వాయిదా వేసిన రజినీ

Apr 9 2017 12:43 AM | Updated on Sep 5 2017 8:17 AM

అభిమానులతో కలిసి ఫొటోలు దిగడం కోసం ఏర్పాటు చేసిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ప్రకటించారు.

తమిళ సినిమా (చెన్నై): అభిమానులతో కలిసి ఫొటోలు దిగడం కోసం ఏర్పాటు చేసిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ 12 నుంచి 16 వరకు దాదాపు 2,000 మంది అభిమానుల తో సమావేశమై, ప్రతి ఒక్కరితో ఓ ఫొటో తీయించుకుని ఫ్యాన్స్‌కు కానుకగా ఇవ్వాలని రజినీ అనుకున్నారు.

రెండు వేల ఫొటోలు దిగడం కష్టమనుకుని 8 మందితో కూడిన బృందాలుగా ఫొటోలు తీసుకుందామని ప్రతిపాదించగా అందుకు అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఒక్కొక్కరితో ఒక్కో ఫొటో దిగితేనే బాగుంటుందని వారు కోరారు. రజనీ రాజకీయ అరంగ్రేటంపై ఊహాగానాల నేపథ్యంలో అభిమానులతో భేటీని రద్దు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement