ఢిల్లీలో కదంతొక్కారు | railways employees held drarna at jantar mantar | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కదంతొక్కారు

Apr 28 2015 4:00 PM | Updated on Sep 3 2017 1:02 AM

ఢిల్లీలో కదంతొక్కారు

ఢిల్లీలో కదంతొక్కారు

భారతీయ రైల్వేను ప్రైవేటీకరణవైపు పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వాల తీరును నిరసిస్తూ రైల్వే ఉద్యోగ సంఘాలు ఢిల్లీలో కదంతొక్కాయి.

భారతీయ రైల్వేను ప్రైవేటీకరణవైపు పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వాల తీరును నిరసిస్తూ రైల్వే ఉద్యోగ సంఘాలు ఢిల్లీలో కదంతొక్కాయి. మంగళవారం జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నాను నిర్వహించాయి. వివిధ రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున తరలివ్చిన రైల్వే ఉద్యోగులతో ఆ ప్రాంతమం కిక్కిరిసిపోయింది.

ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యోగులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తెలుగు రాష్ట్రాలనుంచి ధర్నాకు హాజరైన ఉద్యోగ సంఘాల నేతలు మర్రి రాఘవయ్య, శంకర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరువల్లే రైల్వేకు నష్టం వాటిల్లుతోందని విమర్శించారు. ప్రైవేటీకరణను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని హెచ్చరించారు. ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ నవంబర్ 23న రైల్వే ఉద్యోగులందరూ దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement