భారీ వర్షాలు, వరదల వల్లే ఈ రైలు ప్రమాదాలు జరిగాయని రైల్వే పీఆర్‌ఓ అనిల్ సక్సేనా విచారం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : భారీ వర్షాలు, వరదల వల్లే ఈ రైలు ప్రమాదాలు జరిగాయని రైల్వే పీఆర్‌ఓ అనిల్ సక్సేనా విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టామని, రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సహాయక చర్యలనుపర్యవేక్షిస్తూ, తమకు ఆదేశాలు జారీ చేస్తున్నారని తెలిపారు.
సురేశ్ ప్రభు కూడా సంఘటనా స్థలానికి బయల్దేరారని రైల్వే పిఆర్‌ఓ అనిల్ సక్సేనా తెలిపారు. మాచిక్‌నది ఉద్ధృతంగా ప్రవహిస్తోందని చెప్పారు. ప్రాణనష్టంపై అప్పుడే ఓ అంచనాకు రాలేమని ఆయన తెలిపారు. కాగా ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం 30మంది మృతి చెందగా,వందలాది మంది గాయపడ్డారు.