లోక్సభలో విపక్షనేతగా రాహుల్ ఉండాలి | Rahul should be made opposition leader, says digvijay singh | Sakshi
Sakshi News home page

లోక్సభలో విపక్షనేతగా రాహుల్ ఉండాలి

May 29 2014 2:50 PM | Updated on Aug 14 2018 3:55 PM

లోక్సభలో విపక్షనేతగా రాహుల్ ఉండాలి - Sakshi

లోక్సభలో విపక్షనేతగా రాహుల్ ఉండాలి

రాహుల్ గాంధీని పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చేయాలని, దానివల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి వీలుంటుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు.

రాహుల్ గాంధీని పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చేయాలని, దానివల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి వీలుంటుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించాలనుకుంటే, ఆయన వహించాల్సిందేనని చెప్పారు. ఆయన ముందుండి నాయకత్వం వహించాలని, లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీయే ఉండాలని డిగ్గీరాజా చెప్పారు.

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 ఎంపీ స్థానాలు మాత్రమే దక్కడంతో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. అయితే లోక్సభ స్పీకర్ విచక్షణను అనుసరించి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశముంది. ఒకవేళ అలా వస్తే ఎవరు ప్రతిపక్ష నాయకత్వం వహించాలన్న విషయమై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement