జర్నలిస్టుల అరెస్ట్‌ : యూపీ సీఎంపై రాహుల్‌ ఫైర్‌

Rahul Says Yogi Adityanath Behaving Foolishly - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై అభ్యంతరకరంగా పోస్ట్‌లు చేశారనే ఆరోపణలపై ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్‌ చేయడం పట్ల కాం‍గ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. యూపీ సీఎం యోగి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అసత్య కథనాలు ప్రచురించే జర్నలిస్టులతో పాటు తనపై విషప్రచారం సాగించే ఆరెస్సెస్‌, బీజేపీ ప్రేరేపిత శక్తులను జైళ్లలో పెడితే వార్తాపత్రికలు, న్యూస్‌ఛానెళ్లకు సిబ్బంది కొరత తీవ్రతరమవుతుందని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

యూపీ సీఎం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని, అరెస్ట్‌ చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలని కోరారు. కాగా, యోగి ఆదిత్యానాథ్‌పై అభ్యంతరకర పోస్ట్‌లు షేర్‌ చేశారంటూ ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు ప్రశాంత్‌ కనోజియా సహా ఐదుగురు జర్నలిస్టులను యూపీ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రశాంత్‌ కనోజియాను తక్షణమే విడుదల చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం యూపీ పోలీసులను ఆదేశించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top