రాహుల్ గాంధీ నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని మాజీ కేంద్రమంత్రి కుమారి సెల్జా తెలిపారు.
సరైన సమయంలో రాహుల్ కి బాధ్యత
May 29 2016 1:04 PM | Updated on Mar 22 2019 6:16 PM
జైపూర్: రాహుల్ గాంధీ నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఆయన సరైన సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవుతారని కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నుంచి దూరమవుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అదే సమయంలో పార్టీలో కీలక స్థానంలో పనిచేయడానికి ప్రియాంక గాంధీకి స్వాగతం పలికారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని అన్నారు. 2017 లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ సోనియా, రాహుల్ నాయకత్వంలో మంచి ఫలితాలను సాధిస్తుందని సెల్జా ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ డీఏ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు.
Advertisement
Advertisement