రోడ్ షోలో ఉత్సాహంగా రాహుల్ గాంధీ | Rahul enjoys 'paan' at Unnao | Sakshi
Sakshi News home page

రోడ్ షోలో ఉత్సాహంగా రాహుల్ గాంధీ

Sep 22 2016 7:06 PM | Updated on Sep 4 2017 2:32 PM

రోడ్ షోలో ఉత్సాహంగా రాహుల్ గాంధీ

రోడ్ షోలో ఉత్సాహంగా రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిసాన్ యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

లక్నో: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిసాన్ యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. డియోరియా టూ ఢిల్లీ కిసాన్ యాత్రలో భాగంగా గురువారం లక్నో ప్రాంతంలో పర్యటించిన ఆయన అభిమానులు అందించిన పాన్ను ఆస్వాదించారు.

ఉన్నావ్లో నిర్వహించిన రాహుల్ రోడ్ షోలో స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు యువకులు రాహుల్ భయ్యా జిందాబాద్ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో అటువైపుగా చూసిన రాహుల్‌కు.. ఆ యువకులు స్పెషల్ 'మీఠా పాన్'ను ఆఫర్ చేశారు. అభిమానులు ఇచ్చిన పాన్ను రాహుల్ సంతోషంగా స్వీకరించారు. రోడ్ షోలో పాల్గొంటున్న రాహుల్ ప్రజలతో బాగా మమేకం అవుతున్నారని స్థానిక నాయకులు కితాబిస్తున్నారు. యాత్ర సందర్భంగా రాహుల్ సెల్ఫీలకు సైతం అవకాశం కల్పిస్తూ కార్యకర్తలు, పార్టీ అభిమానులను సంతోషపరుస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement