తెలంగాణకు మరో రెండు వరాలు! | principle approval given for NIMZ in Telangana:Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మరో రెండు వరాలు!

Jan 21 2016 8:46 PM | Updated on Mar 28 2018 11:26 AM

తెలంగాణకు మరో రెండు వరాలు! - Sakshi

తెలంగాణకు మరో రెండు వరాలు!

తెలంగాణలో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి జోన్ (నిమ్జ్)ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

న్యూఢిల్లీ: తెలంగాణలో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి జోన్ (నిమ్జ్)ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ జోన్ లను ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చినట్లు ఆమె గురువారం తెలిపారు. దీంతో ప్రత్యక్షంగా 75వేల మంది, పరోక్షంగా 1.5 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ ట్విట్ చేశారు. 

 

ఈ జోన్లు ముఖ్యంగా ఔషద పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరించేలా ఉంటాయని పేర్కొన్నారు. 2011లో రూపొందించిన పారిశ్రామిక విధానం ఆధారంగా దేశవ్యాప్తంగా ఈ తరహా జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. కాగా మెదక్ జిల్లా జరాసంగం మండలం న్యాల్‌కల్‌ లో ఏర్పాటు చేయనున్న నిమ్జ్కు కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement