ప్రాథమిక విద్యలో భారత్ భేష్ | Primary education in India Whisht | Sakshi
Sakshi News home page

ప్రాథమిక విద్యలో భారత్ భేష్

Apr 10 2015 2:03 AM | Updated on Sep 15 2018 4:26 PM

ప్రాథమిక విద్యలో భారత్ భేష్ - Sakshi

ప్రాథమిక విద్యలో భారత్ భేష్

పాఠశాల విద్యకు నోచుకోని చిన్నారుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో భారత్ విజయం సాధించిందని ఐక్యరాజ్య సమితి

స్కూల్‌కెళ్లని చిన్నారుల సంఖ్య
90% తగ్గిందన్న యునెస్కో

 
న్యూఢిల్లీ: పాఠశాల విద్యకు నోచుకోని చిన్నారుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో భారత్ విజయం సాధించిందని ఐక్యరాజ్య సమితి సంస్థ ‘యునెస్కో’ తన నివేదికలో ప్రశంసించింది.  బడికి వెళ్లని పిల్లల సంఖ్యను భారత్ 90% తగ్గించగలిగిందని పేర్కొంది. సరైన రాజకీయ సంకల్పం, వనరులు ఉంటే 2030 నాటికి సాధించాలనుకుంటున్న విద్యాలక్ష్యాలను అన్ని దేశాలు సాధించగలవనడానికి భారత్ విజయమే గొప్ప ఉదాహరణ అని కొనియాడింది. 

‘అందరికీ విద్య (ఎడ్యుకేషన్ ఫర్ ఆల్) 2000-2015’ నివేదికను గురువారం మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆవిష్కరించారు. జాతి వ్యక్తిత్వ నిర్మాణంలో విద్య కీలకమైన పునాది కావాలన్న ప్రధాని మోదీ ఆలోచన మేరకు విద్యార్థుల్లో నైపుణ్యాల పెంచేందుకు  విద్యావిధానంలో మార్పులకు ప్రయత్నిస్తున్నామని,  చిన్నారులందరికీ విద్యనందించేందుకు కృషి చేస్తున్నామని  తెలిపారు. ప్రపంచం శాంతియుతంగా, అహింసాత్మకంగా మారడం కేవలం విద్య వల్లనే సాధ్యమవుతుందని నోబెల్ పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారు.

యునెస్కో నివేదికలోని ముఖ్యాంశాలు..

 దక్షిణ, పశ్చిమ ఆసియా దేశాల్లో ప్రాథమిక, మాధ్యమిక విద్యలో బాలురు, బాలికల సంఖ్య సమానంగా ఉన్న ఏకైక దేశం భారత్.
{పపంచవ్యాప్తంగా 47% దేశాలు సార్వత్రిక పూర్వ ప్రాథమిక విద్య(ప్రీ-ప్రైమరీ)ను నమోదు చేయగా.. భారత్ సహా 8% దేశాలు అందుకు చేరువలో ఉన్నాయి.
 భారత్‌లో వయోజన విద్యకు సంబంధించి ఆశించిన ప్రగతి కనిపించలేదు. సార్వత్రిక వయోజన విద్య లక్ష్యానికి భారత్ సహా 32% దేశాలు చాలా దూరంలో ఉన్నాయి.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement