ఖట్జు వ్యాఖ్యలపై రాజ్యసభలో గందరగోళం | press council of India ex chairman markandey katju comments on mahatma gandhi | Sakshi
Sakshi News home page

ఖట్జు వ్యాఖ్యలపై రాజ్యసభలో గందరగోళం

Mar 11 2015 12:45 PM | Updated on Sep 2 2017 10:40 PM

ఖట్జు వ్యాఖ్యలపై రాజ్యసభలో గందరగోళం

ఖట్జు వ్యాఖ్యలపై రాజ్యసభలో గందరగోళం

మహాత్మ గాంధీపై ప్రెస్‌ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ మార్కండేయ ఖట్జు చేసిన వ్యాఖ్యలు బుధవారం రాజ్యసభలో గందరగోళానికి తెరలేపాయి.

న్యూఢిల్లీ : మహాత్మ గాంధీపై ప్రెస్‌ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ మార్కండేయ ఖట్జు చేసిన వ్యాఖ్యలు బుధవారం రాజ్యసభలో గందరగోళానికి తెరలేపాయి. ఆయన జాతిపితను బ్రిటిష్ ఏజెంట్‌ అనడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఖట్జుపై తక్షణం చర్యలు తీసుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.

వీలుంటే  మార్కండేయ ఖట్జును జైల్లో పెట్టాలని విపక్షాలు కోరాయి. గతంలోనూ ఖట్జు ఎన్నో సార్లు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశాయి. దీనిపై స్పందించిన డిప్యూటీ చైర్మన్...విపక్ష సభ్యులను వారించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఖట్టు జడ్జిగా లేనందున ఏ రూల్ కింద ఆయనపై.... చర్యలు తీసుకోవాలో చెప్పాలని సభ్యులను ప్రశ్నించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement