బ్రిక్స్‌ సదస్సులో తెలంగాణపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

Powerpoint Presentation On Telangana By Venu Gopalachari in Brics Summit - Sakshi

ఢిల్లీ: బ్రిక్స్‌ దేశాల సదస్సులో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సదస్సుకు దాదాపు 20 దేశాలల నుంచి ప్రతినిథులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, పారిశ్రిమిక రంగంలో తీసుకువచ్చిన టీఎస్‌ ఐపాస్‌, రైతు బంధు పథకం గురించి ప్రత్యేక ప్రతినిథి వేణుగోపాలచారి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరామని, 24 గంటల విద్యుత్‌, నీరు, మౌళిక సదుపాయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కృషిని వారు స్వాగతించారని తెలిపారు.

బ్రిక్స్‌ సమావేశంలో దాదాపు 45 నిమిషాల పాటు తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వేణుగోపాల చారి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిం‍దని చెప్పారు. ప్రభుత్య సిబ్బంది, ఉద్యోగులకు ప్రత్యేకంగా క్రీడలను నిర్వహిస్తున్నామని, తెలంగాణ బజారును ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఆట, పాట ప్రత్యేక ఆకర్షణగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top