పశ్చిమబెంగాల్లో మార్చి చివరి వారం నుంచి ప్రధానిమోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మార్చి చివరి వారం నుంచి ప్రధానిమోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు. మూడు, నాలుగు దశల్లో జరిగే ఎన్నికల కోసం ప్రధాని తేదీల్ని కోరామని, మొత్తం పది సభల్లో ప్రసంగించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రధాని నుంచి సమాచారం రావాల్సివుందని చెప్పారు.
జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు బీజేపీ ప్రధాన నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. కాగా, మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులతో కూడా ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తోంది.