జవాన్లతో దీపావళి సంబరాలు: మోదీ | PM Modi to celebrate Diwali at Harsil with ITBP Jawans | Sakshi
Sakshi News home page

జవాన్లతో దీపావళి సంబరాలు: మోదీ

Nov 7 2018 1:16 AM | Updated on Nov 7 2018 1:16 AM

PM Modi to celebrate Diwali at Harsil with ITBP Jawans - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది దీపావళి వేడుకలను ఆర్మీ జవాన్లతో కలిసి జరుపుకుంటానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ ఫొటోలను అందరితో పంచుకుంటానని వెల్లడించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ మంగళవారం మోదీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

‘ఇజ్రాయెల్‌ ప్రజలందరి తరఫున నా స్నేహితుడు మోదీకి, భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నా. మీ అందరి జీవితాలు సుఖసంతోషాలతో వెల్లివిరియాలని ఆశిస్తున్నా. ఇంతకు మీరు ఏ నగరంలో దీపావళి వేడుకలు జరుపుకుంటారో చెప్పండి’ అని ట్వీట్‌ చేశారు. దీనికి మోదీ స్పందిస్తూ..‘ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా నేను ధైర్యవంతులైన మా బలగాలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటాను’ అని ట్వీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement