కేరళకు 700కోట్ల భారీ సాయం ప్రకటించిన యూఏఈ! | Pinarayi Vijayan Says UAE Government Offers 700 Crore Rupees For Kerala | Sakshi
Sakshi News home page

Aug 21 2018 12:29 PM | Updated on Aug 21 2018 5:20 PM

Pinarayi Vijayan Says UAE Government Offers 700 Crore Rupees For Kerala - Sakshi

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మంగళవారం మీడియాకు తెలిపారు.

తిరువనంతపురం : భారీ వర్షాలతో అతలాకుతలమైన దేవభూమి కేరళను ఆదుకునేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం ముందుకు వచ్చింది. యుఏఈ సక్సెస్‌ స్టోరీలో కేరళ ప్రజల భాగస్వామ్యం కీలకమైందంటూ వ్యాఖ్యానించిన ఆ దేశ నేతల మాటలు నిజం చేస్తూ.. 700 కోట్ల రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మంగళవారం మీడియాకు తెలిపారు. కాగా వరద బీభత్సంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై చర్చించేందుకు ఈరోజు సాయంత్రం అఖిలపక్షం సమావేశం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement