ఐఫోన్‌తో పెళ్లి వీడియో షూటింగ్! | Photographer uses only his iPhone to shoot entire wedding.. Results are magical | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌తో పెళ్లి వీడియో షూటింగ్!

Jan 30 2016 4:40 PM | Updated on Oct 8 2018 4:31 PM

ఐఫోన్‌తో పెళ్లి వీడియో షూటింగ్! - Sakshi

ఐఫోన్‌తో పెళ్లి వీడియో షూటింగ్!

పెళ్లి వీడియో తీయాలంటే ఎంత తతంగం ఉంటుంది.. రెండు మూడు కెమెరాలు, అందులోనూ కాస్త ఖరీదైన వెడ్డింగ్ అయితే క్రేన్ కెమెరాలు. ఇదేమీ లేకుండా కేవలం సెల్‌ఫోన్‌తోనే పెళ్లి వీడియో తీస్తే ఎలా ఉంటుంది?

పెళ్లి వీడియో తీయాలంటే ఎంత తతంగం ఉంటుంది.. రెండు మూడు కెమెరాలు, అందులోనూ కాస్త ఖరీదైన వెడ్డింగ్ అయితే క్రేన్ కెమెరాలు, భారీ లైట్లు ఒకటే హడావుడి. ఇదేమీ లేకుండా కేవలం సెల్‌ఫోన్‌తోనే పెళ్లి వీడియో తీస్తే ఎలా ఉంటుంది? ఏకంగా పెళ్లి వీడియో.. సెల్‌ఫోన్లోనా! అసలు ఇలాంటి ఆలోచన రావడమే కష్టం అనుకుంటే, దానికి అంగీకరించే వధూవరులు దొరకడం ఇంకా కష్టం. దీన్నంతటినీ సాధ్యం చేసిన ఘనత బెర్గర్‌సన్ సెఫీకి దక్కింది. షూటింగ్ మాత్రమే కాదు.. ఎడిటింగ్ కూడా తన ఐఫోన్‌లోనే చేసి తన సత్తా చాటాడు.

ఏడేళ్లుగా పెళ్లి వీడియోలు తీస్తూ సెఫి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఐఫోన్‌తో పూర్తి భారతీయ పెళ్లిని చిత్రీకరించాలని ఉందన్న తన కోరికను ప్రొఫెషనల్ కెమెరామెన్ బెర్గర్ సన్ సెఫి కొన్నాళ్ల క్రితం తన ఫొటోగ్రఫీ బ్లాగ్‌లో పోస్ట్ చేశాడు. ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు చెందిన ఆయన మిత్రులు ఆయుషి, అభిషేక్... సెఫి కోరికను తీర్చేందుకు ముందుకొచ్చారు. తమ పెళ్లిని ఐ ఫోన్ 6ఎస్ ద్వారా  చిత్రీకరించేందుకు అనుమతినిచ్చారు. మూడు రోజులపాటు అట్టహాసంగా జరిగిన పెళ్లి మొత్తాన్ని సెఫి తన ఐ ఫోన్‌లో చిత్రీకరించి, అదులోనే ఎడిటింగ్ కూడా చేశాడు. డీఎస్ఎల్ఆర్  కెమెరా క్వాలిటీకి ఏమాత్రం తీసిపోకుండా వీడియో వచ్చింది.  

అయితే ఐఫోన్ ప్రయోగంతో పగటిపూట దృశ్యాలు అద్భుతంగానే ఉన్నా... రాత్రి షూటింగ్ మాత్రం ఇబ్బందిగానే ఉందని చెప్పాడు సెఫీ. ఈ వీడియోకు ఎన్నో ఫిల్టర్లను, ఎడిటింగ్ ఆప్షన్లను వాడిన తర్వాత తుది రూపాన్నిచ్చామని, ఈ ప్రస్తుత ప్రయోగం 70ల నాటి పోలరాయిడ్ కెమెరాలతో తీసిన తృప్తినిచ్చిందని అంటున్నాడు. తన కోర్కెను మన్నించి ఆయుషీ, అభిషేక్ తనకీ అవకాశం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందంటున్నాడు.

డీఎస్ఎల్ఆర్‌ కెమెరాను ఐఫోన్ భర్తీ చేయలేకపోయినా, ఫొటోగ్రఫీలోనే ఓ కొత్త మీడియాన్ని పరిచయం చేసినట్లవుతుందని అంటున్నాడు. ఐఫోన్‌తో తక్కువ కాంతి ఉన్నప్పుడు చిత్రించడం కొంత కష్టమని, ఈ సందర్భంలో ఎల్ఈడీ లైట్లను వినియోగించి సమస్యను అధిగమించానని సెఫీ తెలిపాడు. డాక్యుమెంటరీలకు, ఫొటో జర్నలిజానికి అందుబాటులో ఉండే ఈ చిత్రాలు ఫైన్ ఆర్ట్‌ను తలపిస్తాయని,  ఓ అద్భుత పెయింటింగ్‌ చూసిన అనుభూతి ఇస్తాయని చెబుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement