breaking news
entire
-
మేమే దేశాన్ని నడిపించాలనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: ‘యావత్ దేశాన్ని మేమే నడపాలని మీరు కోరుకుంటున్నారా?’అంటూ సుప్రీంకోర్టు ఓ పిటిషనర్‌ను ప్రశ్నించింది. రహదారులు, వంతెనలు, విద్యుత్ వైరింగ్ తదితరాలు సక్రమంగా ఉండేలా ప్రజల భద్రతకు తగు చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా వర్తించే సమగ్ర ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈమేరకు వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగి్చల ధర్మాసనం శుక్రవారం ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. షాపింగ్ మాల్లో అన్ని రకాల వస్తువులు, సేవలు అందుబాటులో ఉన్నట్లే అన్ని అంశాలకు ఒకే చోట పరిష్కా రం కోరుతున్న ఈ పిటిషన్ చాలా బాగుందని పేర్కొంది. ‘సమస్యలను నిర్దిష్టంగా ప్రస్తావించలేప్పుడు. ఆచరణ సాధ్యం కాని ఆదేశాలను జారీ చేయలేం. అందుకే ఈ రిట్ పిటిషన్‌పై విచారణకు నిరాకరిస్తున్నాం. పిటిషనర్ కావాలనుకుంటే సరైన రీతిలో పిటిషన్‌ను రూపొందించి, సంబంధిత పరిధిలోని హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం కలి్పస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌లోని సానుకూల అంశాలపై తామెలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని పేర్కొంది. ‘పిటిషన్ కోరిన విధంగా చేసేందుకు ఆర్థిక వనరులు అవసరమవుతాయి. సంబంధిత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, బడ్జెట్‌ను అర్థం చేసుకోవడానికి ఆయా రాష్ట్రాల హైకోర్టులే సరైనవి’అని ధర్మాసనం అభిప్రాయపడింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిత్యం దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పిటిషనర్ తరఫు లాయర్ తెలిపారు. అయితే, యావత్తు దేశాన్ని మేమే పాలించాలని భావిస్తున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘షోరూం, షాపింగ్ మాల్ మాదిరిగానే మీ పిటిషన్ కూడా చాలా బాగుంది. రోడ్లపై గుంతలు, రహదారులు, అసంపూర్తి వంతెనలు తదితర నిర్మాణాలు..ఇలా ప్రతి ఒక్కటీ ఇందులో ఉంది. భూమిపై ఉన్న ప్రతి ఒక్క సమస్యకూ మీరు పరిష్కారం చూపారు’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.పిటిషన్లో ఇంకా ఏముంది? రోడ్లు, వంతెనలు, విద్యుత్ వైరింగ్ వంటి బహిరంగ మౌలిక సదుపాయాల నిర్వహణ, సాధారణ తనిఖీలు, క్రమబద్ధమైన ఆడిటింగ్ నిర్వహించడం ద్వారా ప్రజా భద్రతను నిర్ధారించాలని కోరింది. నగర, శివారు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, ప్రజల భద్రతను పర్యవేక్షించడానికి ఒక ఉన్నత స్థాయి స్వతంత్ర భద్రతా ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో సివిల్ ఇంజనీర్లు, మౌలిక సదుపాయాల నిపుణులు, పౌర సమాజం, మానవ హక్కుల సంస్థల ప్రతినిధులు ఉండాలి. 2020 నుంచి మౌలిక సదుపాయాల లోపాల వల్ల జరిగిన మరణాల డేటాను సేకరించి, డిజిటలైజ్ చేసి బహిరంగ పరచాలి. మూడు నెలలకోసారి జిల్లాల వారీ నివేదికలను సుప్రీంకోర్టుకు సమరి్పంచేలా ఆదేశాలు ఇవ్వాలి. -
ఐఫోన్‌తో పెళ్లి వీడియో షూటింగ్!
పెళ్లి వీడియో తీయాలంటే ఎంత తతంగం ఉంటుంది.. రెండు మూడు కెమెరాలు, అందులోనూ కాస్త ఖరీదైన వెడ్డింగ్ అయితే క్రేన్ కెమెరాలు, భారీ లైట్లు ఒకటే హడావుడి. ఇదేమీ లేకుండా కేవలం సెల్‌ఫోన్‌తోనే పెళ్లి వీడియో తీస్తే ఎలా ఉంటుంది? ఏకంగా పెళ్లి వీడియో.. సెల్ఫోన్లోనా! అసలు ఇలాంటి ఆలోచన రావడమే కష్టం అనుకుంటే, దానికి అంగీకరించే వధూవరులు దొరకడం ఇంకా కష్టం. దీన్నంతటినీ సాధ్యం చేసిన ఘనత బెర్గర్సన్ సెఫీకి దక్కింది. షూటింగ్ మాత్రమే కాదు.. ఎడిటింగ్ కూడా తన ఐఫోన్లోనే చేసి తన సత్తా చాటాడు. ఏడేళ్లుగా పెళ్లి వీడియోలు తీస్తూ సెఫి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐఫోన్‌తో పూర్తి భారతీయ పెళ్లిని చిత్రీకరించాలని ఉందన్న తన కోరికను ప్రొఫెషనల్ కెమెరామెన్ బెర్గర్ సన్ సెఫి కొన్నాళ్ల క్రితం తన ఫొటోగ్రఫీ బ్లాగ్‌లో పోస్ట్ చేశాడు. ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు చెందిన ఆయన మిత్రులు ఆయుషి, అభిషేక్... సెఫి కోరికను తీర్చేందుకు ముందుకొచ్చారు. తమ పెళ్లిని ఐ ఫోన్ 6ఎస్ ద్వారా చిత్రీకరించేందుకు అనుమతినిచ్చారు. మూడు రోజులపాటు అట్టహాసంగా జరిగిన పెళ్లి మొత్తాన్ని సెఫి తన ఐ ఫోన్లో చిత్రీకరించి, అదులోనే ఎడిటింగ్ కూడా చేశాడు. డీఎస్ఎల్ఆర్ కెమెరా క్వాలిటీకి ఏమాత్రం తీసిపోకుండా వీడియో వచ్చింది. అయితే ఐఫోన్ ప్రయోగంతో పగటిపూట దృశ్యాలు అద్భుతంగానే ఉన్నా... రాత్రి షూటింగ్ మాత్రం ఇబ్బందిగానే ఉందని చెప్పాడు సెఫీ. ఈ వీడియోకు ఎన్నో ఫిల్టర్లను, ఎడిటింగ్ ఆప్షన్లను వాడిన తర్వాత తుది రూపాన్నిచ్చామని, ఈ ప్రస్తుత ప్రయోగం 70ల నాటి పోలరాయిడ్ కెమెరాలతో తీసిన తృప్తినిచ్చిందని అంటున్నాడు. తన కోర్కెను మన్నించి ఆయుషీ, అభిషేక్ తనకీ అవకాశం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందంటున్నాడు. డీఎస్ఎల్ఆర్ కెమెరాను ఐఫోన్ భర్తీ చేయలేకపోయినా, ఫొటోగ్రఫీలోనే ఓ కొత్త మీడియాన్ని పరిచయం చేసినట్లవుతుందని అంటున్నాడు. ఐఫోన్‌తో తక్కువ కాంతి ఉన్నప్పుడు చిత్రించడం కొంత కష్టమని, ఈ సందర్భంలో ఎల్ఈడీ లైట్లను వినియోగించి సమస్యను అధిగమించానని సెఫీ తెలిపాడు. డాక్యుమెంటరీలకు, ఫొటో జర్నలిజానికి అందుబాటులో ఉండే ఈ చిత్రాలు ఫైన్ ఆర్ట్‌ను తలపిస్తాయని, ఓ అద్భుత పెయింటింగ్ చూసిన అనుభూతి ఇస్తాయని చెబుతున్నాడు.


