పెట్రోల్‌ డీలర్ల సమ్మె వాయిదా | Petrol pump dealers defer protest against daily price revision | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ డీలర్ల సమ్మె వాయిదా

Jul 11 2017 8:18 AM | Updated on Sep 3 2019 9:06 PM

రోజూవారీ పెట్రో ధరల సమీక్షను నిరసిస్తూ డీలర్లు చేపట్టదలచిన సమ్మెను ఆగస్టు 1కి వాయిదా వేశారు.

న్యూఢిల్లీ: రోజూవారీ పెట్రో ధరల సమీక్షను నిరసిస్తూ డీలర్లు బుధవారం చేపట్టదలచిన సమ్మెను ఆగస్టు 1కి వాయిదా వేశారు. రోజూ ధరలు మారుతుండటం వల్ల పెట్రో ఉత్పత్తులను అప్పుడప్పుడు ఎక్కువ రేటుకు కొని తక్కువ రేటుకు అమ్మల్సి వస్తోందనీ, తత్ఫలితంగా నష్టాలు వస్తున్నాయని పేర్కొంటూ పెట్రో డీలర్లు గతంలో బంద్‌కు పిలుపునిచ్చారు.

జూలై 12న పెట్రోల్, డీజిల్‌ కొనుగోళ్లు, అమ్మకాలు జరపకుండా నిరసన తెలపాలని అప్పట్లో నిర్ణయించారు. అయితే డీలర్లకు కమీషన్లను పెంచడంపై జూలై 31లోపు నిర్ణయం తీసుకోవాలని పెట్రోలియం శాఖ ఆదేశించడంతో సమ్మె వాయిదా పడింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement