13న పెట్రోల్‌ బంకులు బంద్‌  | Patrol bunks are bandh on 13 | Sakshi
Sakshi News home page

13న పెట్రోల్‌ బంకులు బంద్‌ 

Oct 10 2017 3:26 AM | Updated on Sep 3 2019 9:06 PM

Patrol bunks are bandh on 13 - Sakshi

బెంగళూరు: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ అక్టోబర్‌ 12 అర్ధరాత్రి నుంచి 24 గంటల దేశవ్యాప్త సమ్మెకు పెట్రోలియం డీలర్లు పిలుపునిచ్చారు. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే.. అక్టోబర్‌ 27 నుంచి నిరవధికంగా పెట్రోల్, డీజిల్‌ అమ్మకాల్ని నిలిపివేస్తామని యునైటెడ్‌ పెట్రోలియం ఫ్రంట్‌(యూపీఎఫ్‌) సోమవారం ప్రకటించింది.

కర్ణాటక పెట్రోలియం వ్యాపారుల సమాఖ్య అధ్యక్షుడు బీఆర్‌ రవీంద్రనాథ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘పెట్టుబడులపై రాబడులతో పాటు ప్రతీ ఆరు నెలలకు డీలర్ల మార్జిన్ల సమీక్ష, మానవ వనరుల పెంపు, పెట్రోలియం ఉత్పత్తుల నిర్వహణ నష్టాలపై అధ్యయనం తదితర అంశాల పరిష్కారానికి ఓఎంసీలు అంగీకరించాయి. అయితే వాటిలో ఏ ఒక్కదాన్ని పరిష్కరించలేదు’ అని చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement