పార్లమెంటు సమావేశాల పొడిగింపు లేనట్లే! | parliament's monsoon session to be over by 2pm | Sakshi
Sakshi News home page

పార్లమెంటు సమావేశాల పొడిగింపు లేనట్లే!

Aug 13 2015 10:44 AM | Updated on Sep 3 2017 7:23 AM

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు పొడిగింపు లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది.

న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు పొడిగింపు లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సమావేశాలు పొడిగింపుపై చర్చించేందుకు  భేటీ అయినా... పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఏర్పాటుపై నిర్ణయం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలతో ముగియనున్నట్లు సమాచారం.

 

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించన తర్వాతే ప్రభుత్వం నిర్ణయచం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం ముగిసింది. మధ్యాహ్నం మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement