
7 నుంచి 31 వరకు బడ్జెట్ పార్లమెంట్!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 7న ప్రారంభమై జూలై 31 వరకూ కొనసాగనున్నాయి. ఈ మేరకు బుధవారం రాత్రి జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 16వ లోక్‌సభ మొదటి బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌పై చర్చించారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 7న ప్రారంభమై జూలై 31 వరకూ కొనసాగనున్నాయి. ఈ మేరకు బుధవారం రాత్రి జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 16వ లోక్‌సభ మొదటి బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌పై చర్చించారు. అయితే షెడ్యూల్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలిపిన తర్వాతే తేదీలను అధికారికంగా ప్రకటించనున్నారు. తొలి వారం సమావేశాల్లో ప్రీ-బడ్జెట్ ఆర్థిక సర్వే, రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్‌లను ప్రవేశపెట్టే అవకాశముంది.
సమావేశం అనంతరం న్యాయ, టెలికం శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాల తేదీలపై మంత్రివర్గ భేటీలో చర్చించామని, అయితే షెడ్యూల్ ఖరారుకు కొన్ని పద్ధతులు ఉన్నాయని, అవి పూర్తయిన తర్వాత తేదీలను ప్రకటిస్తామని చెప్పా రు. 21 జీవోఎంలు, 9 ఈజీవోఎంలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేశారు. అలాగే ముళ్లైపెరియార్ డ్యామ్ ఎత్తును పెంచే ప్రతిపాదనను పరిశీలించేందుకు సూపర్‌వైజరీ కమిటీని నియమించామన్నారు.