భారత్‌లో దాడులకు పాక్‌ కుట్రలు !

Pakistan Moves 2000 Troops Near LoC To Set Up Training Camps For Terrorist Attacks In Srinagar - Sakshi

శ్రీనగర్‌ : భారత్‌లో దాడులు చేసేందుకు పాకిస్తాన్‌ పథక రచన చేస్తోంది. ఈ క్రమంలోనే పాక్‌ ఉగ్రమూకల సంస్థలతో కలిసి సెస్టెంబర్‌ చివరి వారంలో లేక అక్టోబర్‌ మొదటి వారంలో పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నట్లు ఇంటలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. తాజాగా పాకిస్తాన్‌ బిగ్రేడ్‌కు చెందిన 2000 మందితో కూడిన బలగాలను పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లోని పూంచ్‌ ఏరియాకు చెందిన బాగ్‌, కోట్లీ సెక్టార్‌కు తరలించినట్లు సమాచారం అందింది. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) నుంచి భారత భూభాగంలోకి చొరబడేజైష్-ఎ-ముహమ్మద్ (జెఎమ్), లష్కర్-ఎ-తొయిబా తీవ్రవాదులకు ఈ బలగాలు సహకరించనున్నాయి.

ప్రస్తుతం ఈ బలగాలు నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిసింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఎస్‌ఎస్‌జి కమాండోలతో కలిసి ఎల్‌ఇటి, జైషే ఉగ్రవాదులు ఇప్పటికే ఫార్వర్డ్ లాంచ్ ప్యాడ్‌లలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె)లో ఈ ఉగ్రవాద గ్రూపుల కోసం శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశారు. జమాత్-ఎ-ఇస్లామి ఈ శిబిరాలకు నాయకత్వం వహిస్తుండగా, జైష్-ఎ-ముహమ్మద్, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌, ఎల్‌ఈటీ తమ వంతు సహకారం అందించనున్నట్లు తెలిసింది. వజీరాస్తాన్ నుంచి పెద్ద మొత్తంలో ఉగ్రవాదులను చేర్చుకునేందుకు ఐఎస్‌ఐ పెద్ద మొత్తంలో జాబితాను తయారు చేసినట్లు, దీనికంతటికి హిజ్బుల్‌ కమాండర్‌ షంషేర్‌ఖాన్‌ నాయకత్వం వహించనున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top