పాకిస్తాన్ వాసి అరెస్ట్ | Pak national arrested along IB in Jammu | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ వాసి అరెస్ట్

Sep 23 2016 2:14 PM | Updated on Aug 20 2018 4:44 PM

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సిబ్బంది ఓ పాకిస్తాన్ దేశీయుడిని అదుపులోకి తీసుకుంది.

జమ్మూ: భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సిబ్బంది ఓ పాకిస్తాన్ దేశీయుడిని అదుపులోకి తీసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున పర్గ్వాల్ సెక్టార్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది.. అక్రమంగా సరిహద్దు దాటి భారత్లోకి చొరబడిన వ్యక్తిని గుర్తించారు.

సదరు వ్యక్తి నుంచి మొబైల్ ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకొని అధికారులు విచారణ జరుపుతున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని సియాల్కొటె సెక్టార్కు చెందిన అబ్దుల్ ఖయూమ్గా గుర్తించారు. ఈ ఘటన వెనుక ఏదైనా ఉగ్రకోణం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement