‘చైనాతో చర్చల వివరాలు వెల్లడించాలి’

Owaisi Says Government Should Disclose The Outcome Of Military Level Dialogue - Sakshi

కేంద్రం తీరుపై ఓవైసీ ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌ : భారత్‌, చైనా సైనికాధికారుల స్ధాయి చర్చల సారాంశాన్ని వెల్లడించాలని ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ‘మన సైన్యం, చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు..చైనా ప్రతినిధులతో ఏం మాట్లాడారో కేంద్ర ప్రభుత్వం దేశానికి వివరించాల’ని అన్నారు. ఈ విషయంలో కేంద్రం ఎందుకు మౌనం దాల్చుతోందని నిలదీశారు. లడఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా అని ఓవైసీ ప్రశ్నించారు.

ఇండో - చైనా సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వ్యవహారంలో ప్రతిష్టంభనపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సైతం కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. మరోవైపు భారత్‌, చైనాలు సరిహద్దు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు అంగీకరించాయని విదేశాంగ శాఖ వెల్లడించగా, సరిహద్దుల్లో చైనా ఆర్మీ పెద్ద ఎత్తున సేనలను మోహరించడం ఆందోళన రేకెత్తిస్తోంది. కాగా, సరిహద్దు సమస్యల పరిష్కారం దిశగా భారత్‌-చైనా సైనికాధికారుల భేటీ శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

చదవండి : లాక్‌డౌన్‌ రాజ్యాంగ విరుద్ధం: ఒవైసీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top