ఫ్లూ భారిన‌ప‌డి 15,600 పందులు మృతి : మంత్రి

Over 15,600 Pigs Dead Due To African Swine Fever In Assam - Sakshi

గువ‌హ‌టి :  భార‌త్‌లో ఓ వైపు క‌రోనా వైర‌స్ విజృంభి‌స్తుంటే ఈశాన్య భారతంలో ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్ బీభ‌త్సం సృష్టిస్తోంది.  ఫిబ్ర‌వ‌రిలో అస్సాంలో తొలి స్వైన్ ఫీవ‌ర్ కేసు న‌మోదైంది. ప్ర‌స్తుతం అది తీవ్ర‌రూపం దాల్చి 15,600 పందులు మ‌ర‌ణించాయ‌ని ఆ రాష్ర్ట ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి అతుల్ బోరా తెలిపారు. పందుల లాలాజలం, ర‌క్తం, మాంసం ద్వారా ఈ వైర‌స్ వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా పందుల్లో సంక్ర‌మించే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన అంటువ్యాధి కావ‌డంతో దీని నివారణకు పందుల‌ను సామూహికంగా చంపేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చింది.  వ్యాధి నివార‌ణ‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం  క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని అతుల్ అన్నారు.  ఈ నేప‌థ్యంలో వ్యాధి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు పందుల‌ను సామూహికంగా చంపేందుకు స్థానిక ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. అయితే కేవ‌లం వైర‌స్ సోకిన పందుల‌ను మాత్ర‌మే చంపాల‌ని నిర్ణ‌యించింది. (ఒకపక్క కరోనా, మరోపక్క వరదలు )

ఇక వ్యాధి బారిన ప‌డి చ‌నిపోయిన పందులకు కేంద్ర ప్ర‌భుత్వం ద్వారా ప‌రిహారం అందించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం డిమాండ్ చేస్తోంది. పందులను పెంచే రైతులకు ఒకే విడ‌త‌లో రూ.144 కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించాల‌ని కేంద్రాన్ని కోరింది. ఇక‌ రాష్ట్రంలో పెరుగుతున్న ఈ సంక్షోభం కారణంగా తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని అసోం ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ మంత్రి అతుల్ బోరా తెలిపారు. రోజురోజుకీ పందుల మ‌ర‌ణాలు పెరుతున్నాయ‌ని, ప్ర‌స్తుతం వైర‌స్ ప్ర‌భావం ప‌ది జిల్లాల‌కు సోకింద‌ని పేర్కొన్నారు. ఇప్పటికే 15,600  పందులు చనిపోయాయ‌ని, వీటి సంఖ్య మ‌రింత పెరుగుతోంద‌న్నారు. పంది పెంప‌కం దారుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించే దిశ‌గా పంది మాంసం అమ్మ‌కం, వినియోగం విష‌యంలో కొన్ని నిబంధ‌న‌ల‌పై స‌డ‌లింపు ఇచ్చామ‌ని అతుల్ బోరా చెప్పారు. (టాపర్‌గా కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు )

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top