'అది నమ్మకానికీ, దేశభక్తికీ సంబంధించిన అంశం' | 'One Rank, One Pension' matter of faith for me says Modi | Sakshi
Sakshi News home page

'అది నమ్మకానికీ, దేశభక్తికీ సంబంధించిన అంశం'

May 31 2015 2:18 PM | Updated on Oct 9 2018 4:36 PM

'అది నమ్మకానికీ, దేశభక్తికీ సంబంధించిన అంశం' - Sakshi

'అది నమ్మకానికీ, దేశభక్తికీ సంబంధించిన అంశం'

ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ అంశం నమ్మకానికి, దేశభక్తికి సంబంధించినదని ప్రధాని మోదీ అన్నారు. 40 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను తమ ప్రభుత్వం తప్పక పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.

పదవీ విరమణ పొందిన సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ అంశం నమ్మకానికి, దేశభక్తికి సంబంధించిందన్న ఆయన.. 40 ఏళ్లుగా ఈ సమస్య అపరిష్కృతంగా ఉండటం శోచనీయమని, తర్వరలోనే దీనికి సరైన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.


ఎనిమిదో విడత మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆలిండియా రేడియోలో మాట్లాడిన ప్రధాని పలు అంశాలపై మనసులోని మాటలను వ్యక్తపర్చారు. ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన సామాజిక సంక్షేమ పథకాలను గురించి మాట్లాడుతూ.. 20 రోజుల్లోని 8.52 కోట్ల మంది ప్రజలు ఆయా సంక్షేమ పథకాల్లో భాగస్వాములు కావడం వారికి ప్రభుత్వం పై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోన్నదన్నారు. కాగా, ర్యాంకు, పెన్షన్ విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనిపక్షంలో దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని మాజీ సాయుధ సైనికులు తేల్చిచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement