breaking news
One Rank
-
ఒన్ ర్యాంక్-ఒన్ పెన్షన్‌కి గ్రీన్ సిగ్నల్
-
'అది నమ్మకానికీ, దేశభక్తికీ సంబంధించిన అంశం'
పదవీ విరమణ పొందిన సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ అంశం నమ్మకానికి, దేశభక్తికి సంబంధించిందన్న ఆయన.. 40 ఏళ్లుగా ఈ సమస్య అపరిష్కృతంగా ఉండటం శోచనీయమని, తర్వరలోనే దీనికి సరైన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఎనిమిదో విడత మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆలిండియా రేడియోలో మాట్లాడిన ప్రధాని పలు అంశాలపై మనసులోని మాటలను వ్యక్తపర్చారు. ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన సామాజిక సంక్షేమ పథకాలను గురించి మాట్లాడుతూ.. 20 రోజుల్లోని 8.52 కోట్ల మంది ప్రజలు ఆయా సంక్షేమ పథకాల్లో భాగస్వాములు కావడం వారికి ప్రభుత్వం పై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోన్నదన్నారు. కాగా, ర్యాంకు, పెన్షన్ విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనిపక్షంలో దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని మాజీ సాయుధ సైనికులు తేల్చిచెప్పారు.