పఠాన్కోట్ లో పేలుడు; మరో జవాన్ మృతి | one died in grenade explosion at Pathankot air base center | Sakshi
Sakshi News home page

పఠాన్కోట్ లో పేలుడు; మరో జవాన్ మృతి

Jan 3 2016 12:48 PM | Updated on Sep 3 2017 3:01 PM

పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్ కేంద్రంలో ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఐఈడీ గ్రెనేడ్ పేలుడు సంభవించింది.

పఠాన్కోట్: పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్  బేస్ లో ఆదివారం ఉదయం ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆర్మీ ఆఫీసర్ నిరంజన్ సింగ్ మృతిచెందగా, మరో ఐదుగురు సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం ఎయిర్బేస్ నుంచి తుపాకీ కాల్పులతో పాటు పేలుడు శబ్ధాలు వినిపించినట్టు స్థానికుల చెబుతున్నారు.  ఎయిర్ ఫోర్స్ బేస్లో ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్ కౌంటర్ లో మొత్తం ఐదగురు ఉగ్రవాదులను హతమార్చగా, ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

ఉగ్రవాదుల మృతదేహాల పక్కన పడిఉన్న ఏకే-47, గ్రనైడ్స్, జీపీఎస్ పరికరాలు, మోర్టార్లను సిబ్బంది స్వాధీనం చేసుకుంది. ఆర్మీ, పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఎయిర్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఐఎస్ఐ పథకం ప్రకారం జైష్ ఫిదేయిన్స్ ఉగ్రవాదులు పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంపుపై దాడి చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement