4న ‘అగస్టా’ నిజాలు పార్లమెంటులో పెడతా | On 4 'Augusta' the facts are exposed in Parliament | Sakshi
Sakshi News home page

4న ‘అగస్టా’ నిజాలు పార్లమెంటులో పెడతా

May 2 2016 1:57 AM | Updated on Sep 3 2017 11:12 PM

వివాదాస్పద అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కుంభకోణానికి సంబంధించిన వాస్తవాలను ఈనెల 4న పార్లమెంటు ముందు ఉంచుతానని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ చెప్పారు.

పణజీ: వివాదాస్పద అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కుంభకోణానికి సంబంధించిన వాస్తవాలను ఈనెల 4న పార్లమెంటు ముందు ఉంచుతానని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ చెప్పారు. యూపీఏ హయాంలో ఆ కంపెనీకి ఆర్డర్ ఇచ్చేందుకు వీలుగా అవసరమైన నిబంధనలను సవరించారన్నారు. మామూళ్లు తీసుకున్న వారు ప్రాసిక్యూషన్‌కు దొరకకుండా ఉండేందుకు ఆధారాలు లేకుండా చేశారని, అయితే దాన్ని తాము నిరూపిస్తామని ఆదివారమిక్కడ విలేకరులతో చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement