వరుడికి 103 ఏళ్లు, వధువుకి 91 ఏళ్లు | old age couple in the world | Sakshi
Sakshi News home page

వరుడికి 103 ఏళ్లు, వధువుకి 91 ఏళ్లు

Jun 15 2015 9:12 AM | Updated on Sep 3 2017 3:47 AM

వరుడికి 103 ఏళ్లు, వధువుకి 91 ఏళ్లు

వరుడికి 103 ఏళ్లు, వధువుకి 91 ఏళ్లు

లేటు వయసులో పెళ్లి చేసుకున్న ఓ జంట గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు.

లండన్: లేటు వయసులో పెళ్లి చేసుకున్న ఓ జంట గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. లేటు అంటే మామూలు లేటు కాదు.. వరుడికి 103 ఏళ్లు, వధువుకి 91 ఏళ్లు. ఇంత ముదిమి వయసులో వీరు 50 మంది కుటుంబ సభ్యులు, ఓ గిన్నిస్ ప్రతినిధి సమక్షంలో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వరుడు జార్జ్ కిర్బీ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ వివాహం జరిగింది. వీల్‌చైర్‌పై ఉన్న వరుణ్ని తోసుకుంటూ వచ్చిన వధువు డోరీన్ లక్కీ.. అతని వేలికి ఉంగరాన్ని తొడిగింది. వీరిద్దరూ 1988లో కలుసుకున్నారు. అప్పటికి కిర్బీ వైవాహిక బంధం విఫలమవ్వగా, లక్కీ తన భర్తను కోల్పోయి మూడేళ్లయింది. వీరికి ఏడుగురు బిడ్డలు, 15 మంది మనుమలు, ఏడుగురు మునిమనుమలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement