బ్యాంక్, బంగారం షాపుల్లో అరనిమిషం ‘నో మాస్క్‌’ 

No Masks For 30 Seconds In Banks And Gold Shops Says Madhya Pradesh Government - Sakshi

భోపాల్‌: కరోనా వ్యాప్తిని కట్టడిచేసేందుకు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. రెండు నెలల లాక్‌డౌన్‌ అనంతరం కరోనా నిబంధనలను దశల వారీగా కొంత సడలించారు. అయితే మధ్య ప్రదేశ్‌ పోలీసులు మాత్రం మరో కొత్త రూల్‌ని అమలులోకి తెచ్చారు. బ్యాంకులు, బంగారం షాపులను సందర్శించేవారు 30 సెకన్ల పాటు మాస్క్‌ని తీసివేయాలని మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజలను కోరింది.  (బుద్ధి లేదా.. ఇంత బాధ్యతారాహిత్యమా?)

ఇంతకీ విషయం ఏమిటంటే మాస్క్‌లు ధరించి బ్యాంకుల్లోనూ, బంగారం షాపుల్లోనూ దోపిడీలకు పాల్పడే ప్రమాదం ఉందనీ, అలా జరిగితే మాస్క్‌ల కారణంగా సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయినప్పటికీ వారిని గుర్తించడం కష్టం కనుక ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా ఈ నోమాస్క్‌ ఆదేశాలు జారీచేసింది. 30 సెకన్ల పాటు మాస్క్‌తీయడం వల్ల వారిని సీసీటీవీ కెమెరాల్లో బంధించే వీలుంటుంది. తప్పు చేస్తే, తప్పించుకునే  అవకాశం కూడా ఉండదు. (మాస్క్ లేకుంటే శిక్ష తప్పదు )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top