బడ్జెట్‌ 2019 : అందరికీ ఇళ్లు

Nirmala Sitaraman Mentions Housing For All In Budget Speech - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి కుటుంబానికి ఇల్లు సమకూరేలా అందుబాటు ఇళ్లను ప్రజలకు చేరువ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు. 2019--22 మధ్య 1.95 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్ధల ఖాళీ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇక సాగరమాలలో పోర్టుల కనెక్టివిటీ కొనసాగిస్తామని, ఉద్యోగాల కల్పనకు భారీ పెట్టుబడులకు బాటలు వేస్తామని చెప్పారు. దేశీయ, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సంస్కరణలను ముందుకు తీసుకువెళతామని స్పష్టం చేశారు. జీఎస్టీ నమోదిత సంస్ధలకు వడ్డీలో సబ్సిడీ, ఎంఎస్‌ఎంఈ సంస్ధల చెల్లింపులకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎంఎస్‌ఎంఈలకు రెండు శాతం తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top