కొత్త రైల్వే బడ్జెట్... తొమ్మిది ముఖ్యాంశాలు | Nine key takeaways in railway budget | Sakshi
Sakshi News home page

కొత్త రైల్వే బడ్జెట్... తొమ్మిది ముఖ్యాంశాలు

Jul 8 2014 3:24 PM | Updated on Oct 4 2018 5:15 PM

కొత్త రైల్వే బడ్జెట్... తొమ్మిది ముఖ్యాంశాలు - Sakshi

కొత్త రైల్వే బడ్జెట్... తొమ్మిది ముఖ్యాంశాలు

రైల్వే బడ్జెట్ లోని అతి ముఖ్యమైన తొమ్మిది అంశాలేమిటో ఒకసారి చూద్దాం

చిరునవ్వుల మంత్రి సదానంద గౌడ రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎవరికెన్నిరైళ్లు వచ్చాయి, టికెట్ల ధరలెంత పెరిగాయి వంటి ప్రశ్నలను పక్కనబెడితే రైల్వే బడ్జెట్ లోని అతి ముఖ్యమైన తొమ్మిది అంశాలేమిటో ఒకసారి చూద్దాం.
 
* రైల్వేలో ఆపరేషన్స్ విభాగం మినహా మిగతా అన్నిటా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు తెరిచారు. క్యాబినెట్ అనుమతి వస్తే ఎఫ్ డీ ఐ వచ్చే అవకాశాలున్నాయి. 
 
* ఇక రైళ్లు వేగంగా పరుగులు తీస్తాయి. తొమ్మిది సెక్టార్లలో రైళ్ల వేగాన్ని గంటలకు 160 కి.మీ నుంచి 200 కిమీకి పెంచుతారు. 
*  ఇక భారతదేశంలోనూ బుల్లెట్ ట్రెయిన్లు పరుగులు తీస్తాయి. మొదటి బుల్లెట్ ట్రెయిన్ మహారాష్ట్ర నుంచి అహ్మదాబాద్ వరకూ నడుస్తుంది. 
 
* వాజ్ పేయీ హయాంలో స్వర్ణ చతుర్భుజి రోడ్ల లాగా నరేంద్ర మోడీ యుగంలో వజ్ర చతుర్భుజి రైలు మార్గాలు రాబోతున్నాయి. 
* 25 లక్షలకు మించి చేసే అన్ని కొనుగోళ్లను ఈ ప్రొక్యూర్ మెంట్ పద్ధతిలోనే ఇకపై చేయాల్సి ఉంటుంది. దీని వల్ల అవినీతి తగ్గి, పారదర్శకత పెరుగుతుంది.
 
* ఈ ఆర్ధిక సంవత్సరం ప్రభుత్వం 65,450 కోట్లు రైల్వేలపై ఖర్చు చేయబోతోంది. రైల్వేలలో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా 6,005 కోట్లు సంపాదించబోతోంది. 
 
* మహిళా ప్రయాణికుల భద్రత కోసం 4000 మంది మహిళా పోలీసులను రిక్రూట్ చేయబోతున్నారు. 
 
* ఇక రైల్వే స్టేషన్లలో బ్రాండెడ్ ఆహారం లభిస్తుంది. రైల్వే క్యాంటీన్లలో చెత్త ఆహారం గురించి ఫిర్యాదు చేయడం మానేయొచ్చు. 
 
* ఈ టికెటింగ్ వ్యవస్థ వేగవంతమౌతుంది. మొబైల్ ఫోన్ల ద్వారా, పోస్టాఫీసుల ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల ఒకే సమయంలో లక్షకు పైగా ప్రయాణికులు టికెట్లు తీసుకోవచ్చు. 
 
* రైల్వే స్టేషన్లు, అన్ని రైల్వేలలో వైఫై సదుపాయం ఉంటుంది. మనం ఎక్కడున్నా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది. రైలు ప్రయాణంలో ఉండగా ఫోన్లు అందక ఇబ్బంది పడటం ఉండదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement