పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం | new governors for 3 states, najma heptullah for manipur | Sakshi
Sakshi News home page

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

Aug 17 2016 2:34 PM | Updated on Sep 4 2017 9:41 AM

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 75 సంవత్సరాల వయసు రావడంతో కేంద్ర మంత్రి పదవి నుంచి ఇటీవలే తప్పుకొన్న సీనియర్ నాయకురాలు డాక్టర్ నజ్మాహెప్తుల్లాను మణిపూర్ గవర్నర్‌గా నియమించారు. ఆమె ఈ రాష్ట్రానికి 18వ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2015 సెప్టెంబర్ 30వ తేదీ నుంచి మణిపూర్ బాధ్యతలను కూడా మేఘాలయ గవర్నర్ వి. షణ్ముగనాథన్ చూస్తున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్ వచ్చారు. ఈ రాష్ట్రానికి వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.

ఆమెతో పాటు అసోం గవర్నర్‌గా బన్వారీలాల్ పురోహిత్, పంజాబ్ గవర్నర్‌గా వీపీ సింగ్ బద్నోర్‌లను నియమించారు. అలాగే, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ గా జగదీష్ ముఖిని నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement