యోగికి ఎన్డీ తివారి భార్య లేఖ | ND Tiwari Ill Last Stage Says Ujjwala Tiwari | Sakshi
Sakshi News home page

May 25 2018 11:41 AM | Updated on May 25 2018 12:57 PM

ND Tiwari Ill Last Stage Says Ujjwala Tiwari - Sakshi

ఎన్డీ తివారి (ఫైల్‌ ఫోటో)

డెహ్రాడూన్‌:   యూపీ మాజీ సీఎం ఎన్డీ తివారి భార్య ఉజ్వల, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు లేఖ రాశారు. తాము ఇప్పుడు నివాసం ఉంటున్న బంగ్లాను ఖాళీ చేయడానికి కాస్త సమయం ఇవ్వాలంటూ లేఖలో ఆమె సీఎంను కోరారు. తివారి (92) ఆరోగ్యం బాగోలేదని అమె లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగా తమ కుమారుడు రోహిత్‌ శేఖర్‌ కూడా అసుపత్రిలోనే ఉంటూ ఆయన్ని చూసుకుంటున్నారని.. ఈకారణాలతో ప్రస్తుతం నివాసం ఖాళీ చేయలేమని అమె తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా తివారీ గత ఎనిమిది నెలలుగా ఢిల్లీలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

మాజీ సీఎంలు ప్రభుత్వ బంగ్లాలను తక్షణమే ఖాళీ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను మేరకు మే 17న యూపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రులకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాలపై తమకు గౌరవం ఉందని పేర్కొన్న తివారీ భార్య, పరిస్థితుల నేపథ్యంలో కాస్త గడువు ఇవ్వాలని కోరారు. కాగా తివారి నాలుగు సార్లు యూపీ సీఎంగా, ఒకసారి ఉత్తరాఖండ్‌ సీఎంగా పని చేశారు. మరోపక్క తాము ఇప్పటికిప్పుడు బంగ్లాలు ఖాళీ చేయలేమని మాజీ సీఎంలు అఖిలేష్‌ యాదవ్‌, ములాయం సింగ్‌లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు.

Advertisement
 
Advertisement
Advertisement