తాజ్ మహల్‌కు ప్రకృతి చికిత్స! | Nature of the Taj Mahal! | Sakshi
Sakshi News home page

తాజ్ మహల్‌కు ప్రకృతి చికిత్స!

Jun 9 2014 1:49 AM | Updated on Sep 2 2017 8:30 AM

తాజ్ మహల్‌కు ప్రకృతి చికిత్స!

తాజ్ మహల్‌కు ప్రకృతి చికిత్స!

మన ముఖ వర్చస్సు తగ్గితే ఏం చేస్తాం... కొంత మంది అయితే, ఏవేవో ఫేస్‌ప్యాక్‌లు వేసుకుంటారు.

న్యూఢిల్లీ: మన ముఖ వర్చస్సు తగ్గితే ఏం చేస్తాం... కొంత మంది అయితే, ఏవేవో ఫేస్‌ప్యాక్‌లు వేసుకుంటారు. కొందరు సహజసిద్ధంగా ముల్తానా మట్టిని ముఖంపై ప్యాక్‌లా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవడం చేస్తారు. దీనివల్ల వారి ముఖంలో కొత్త వెలుగు వస్తుంది. అచ్చం అలాగే, ప్రముఖ కట్టడం తాజ్ మహల్‌కు బురదమన్నుతో త్వరలోనే చిక్సిత చేయనున్నారు. పెరిగి పోయిన కాలుష్యం కారణంగా తాజ్‌మహల్ పాలరాతి అందాలు పసుపురంగులోకి మారుతున్నాయి. దీంతో కాలుష్యాన్ని తొలగించేందుకు భారత పురావస్తు విభాగం రంగంలోకి దిగింది.

తాజ్‌మహల్ సహజ అందాలను తిరిగి తీసుకొచ్చేందుకు మడ్‌పాక్(మట్టిపూత)తో చికిత్స చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. నిమ్మగుణం అధికంగా ఉన్న మట్టిని తాజ్ మహల్‌పై, తెల్లదనం తగ్గిన చోట పూతలా వేసి ఆరిన తర్వాత మట్టిపూతను తీసే సి మెత్తటి నైలాన్ బ్రష్‌లతో డిస్టిల్డ్ వాటర్‌తో ఆయా ప్రాంతాల్లో కడుగుతారు. ఈ కట్టడానికి 1994, 2001, 2008లోనూ ఇలానే చికిత్స చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement