9.1 తీవ్రతతో ఢిల్లీలో భారీ భూకంపం అంటూ..

Nasa Predicting 9.1 Magnitude Earthquake In Delhi Is Fake - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ భూకంపం సంభవించబోతోందంటూ నాసా పేరిట ఓ నకిలీ వార్త వాట్సాప్‌లో షేర్‌ అవుతోంది. 9.1 తీవ్రతతో రాబోయే భూకంపం లక్షల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటుందని ఆ వార్త సారాంశం.

వచ్చే నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య గురుగ్రామ్‌ కేంద్రంగా ఈ తీవ్ర భూకంపం సంభవిస్తుందని నాసా ప్రకటించినట్లు అందులో ఉంది. ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌, జమ్మూ కశ్మీర్‌, తమిళనాడు, రాజస్థాన్‌, బిహార్‌లోని మీ సన్నిహితులందరికీ ఈ మెసేజ్‌ను వెంటనే షేర్‌ చేయండని కూడా రాసి ఉంది.

ఇది నకిలీ వార్త అని పసిగట్టేది ఇలా..
భూకంపం ఇప్పుడు సంభవిస్తుంది అని ముందుగానే ఊహించి చెప్పలేం. శాస్త్రవేత్తలు కూడా అలా చేయలేరు. న్యూఢిల్లీలో సంభవించే భూకంపం తమిళనాడుపై ఎలా ప్రభావం చూపుతుంది?. భారీ భూకంపం లాంటి విపత్తు ఢిల్లీని చుట్టుముట్టబోతుంటే నాసా కంటే ముందు భారత ప్రభుత్వమే దీనిపై ప్రకటన చేస్తుంది.

Advertisement
Advertisement

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top