శ్రీనివాస్ మృతికి మోడీ, వైఎస్ జగన్, బాబు సంతాపం | Narendra modi, ys jagan, chandrababu condoles death of mandolin Srinivas | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్ మృతికి మోడీ, వైఎస్ జగన్, బాబు సంతాపం

Sep 19 2014 12:54 PM | Updated on Aug 21 2018 9:36 PM

ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిస్ శ్రీనివాస్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.

న్యూఢిల్లీ : ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిస్ శ్రీనివాస్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.  సంగీతంలో మాండోలిసన్ శ్రీనివాస్ సేవలను ఆయన ఈ సందర్శంగా గుర్తు చేశారు. మాండోలిన్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మోడీ తన అధికారక ట్విట్టర్లో సంతాప సందేశాన్ని పోస్ట్  చేశారు. మాండోలిన్ శ్రీనివాస్ ...సంగీతానికి ఎనలేని కృషి చేశారని ఆయన సేవలు చిరస్మరణీయమని మోడీ మరో ట్విట్ చేశారు. మాండోలిన్ శ్రీనివాస్ కాలేయ సమస్యతో శుక్రవారం ఉదయం చెన్నైలో మృతి చెందిన విషయం తెలిసిందే.

మరోవైపు మాండోలిన్ శ్రీనివాస్ మృతి పట్లపై ప్రముఖులు సంతాపం తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సంతాపం ప్రకటించారు.  చిన్న వయసులోనే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న మాండోలిన్ శ్రీనివాస్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటం బాధాకరమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement