ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న నేపాల్ పర్యటనకు వెళ్లనున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న నేపాల్ పర్యటనకు వెళ్లనున్నారు. 26, 27న ఖాట్మండులో జరిగే సార్క్ సదస్సులో మోదీ పాల్గొంటారు.
దేశ రాజకీయాలు, అధికార కార్యక్రమాలతో మోదీ తీరికలేకుండా ఉండటంతో నేపాల్ పర్యటనను కుదించుకున్నారు. నేపాల్లోని ఇతర ప్రాంతాల పర్యటనను మోదీ రద్దు చేసుకున్నారు. మోదీ ఇటీవల కూడా నేపాల్లో పర్యటించారు.