
మతహింస నిరోధక చట్టాన్ని వ్యతిరేకించండి
కేంద్రం తీసుకువస్తున్న మతహింస నిరోధక చట్టాన్ని వ్యతిరేకించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ కోరారు.
సీఎం కిరణ్‌కు నరేంద్ర మోడీ లేఖ
కేంద్రం తీసుకువస్తున్న మతహింస నిరోధక చట్టాన్ని వ్యతిరేకించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ కోరారు. ఈ మేరకు కిరణ్‌కు లేఖ రాశారు. మతహింస నిరోధక చట్టం రాష్ట్రాల అధికారాలను హరించేలా ఉందన్నారు. శాంతి భద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిదని, కానీ ఈ చట్టంద్వారా కేంద్రం రాష్ట్ర అధికారాల్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమేగాక కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వం తనకు నచ్చని ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో దీనిద్వారా దుర్వినియోగానికి పాల్పడే అవకాశముందన్నారు.