అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ | narendra modi reaches washington dc | Sakshi
Sakshi News home page

అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ

Mar 31 2016 12:05 PM | Updated on Apr 4 2019 4:25 PM

అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ - Sakshi

అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరానికి చేరుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరానికి చేరుకున్నారు. నాలుగో అణు భద్రతా సదస్సులో పాల్గొనేందుకు ఆయన వెళ్లిన విషయం తెలిసిందే. ముందుగా బెల్జియం రాజధాని బ్రసెల్స్‌కు వెళ్లిన మోదీ.. అక్కడి నుంచి నేరుగా వాషింగ్టన్ డీసీ నగరానికి వెళ్లారు.

భారతదేశంలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అక్కడ ఆయనకు స్వాగతం పలికారు. నాలుగో అణు భద్రతా సదస్సులో ప్రధానంగా అణు సామగ్రిని దుర్వినియోగం చేస్తున్న తీరు, ఉగ్రవాదులకు వీటి అందుబాటు, ఐఎస్ఐఎస్ లాంటి సంస్థల చేతికి అణ్వస్త్రాలు వెళ్లడం లాంటి అంశాలపై చర్చిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement