ప్రధాని నరేంద్ర మోడీ త్రివిద దళాల సైనికాధికారులతో సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ త్రివిద దళాల సైనికాధికారులతో సమావేశమయ్యారు. శుక్రవారం రక్షణ శాఖ వార్ రూమ్లో ఈ భేటీ జరిగింది. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న పరిస్థితుల్లో మోడీ సైన్యాధికారులతో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే దేశానికి రక్షణ అవసరమని మోడీ అన్నారు. దౌత్య, రక్షణ విషయాల్లో కొత్త ఆలోచనా విధానం అవసరమని చెప్పారు. ఆకాశం, భూమి, జలాలపై నియంత్రణ కంటే అంతరిక్షంపై నియంత్రణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించాక సైనిక దళాల ప్రధానాధికారులతో మొదటిసారి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, త్రివిద దళాల అధిపతులు పాల్గొన్నారు.