
జైపూర్: భారత న్యాయ వ్యవస్థలో ప్రస్తుతం అమలవుతోన్న చాలా చట్టాలు బ్రిటీష్ పాలనా కాలంలో రూపుదిద్దుకున్నవే. దేశానికి స్వాతంత్ర్య వచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటకీ కోర్టుల్లో ఇంకా పురాతన చట్టాలు, పాత నియమాలనే అనుసరిస్తున్నారు మన న్యాయకోవిధులు. అయితే వాటికి చరమగీతం పాడేందుకు రాజస్తాన్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి న్యాయమూర్తులు కేసులను వాదించే సందర్భంలో ‘మై లార్డ్’, ‘యువర్ హానర్’ అనే పదాల వాడకంపై నిషేధం విధించింది.
ఈ మేరకు రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రవీందర్ భట్టు నేతృత్వంలో భేటీ అయిన కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మీదట కోర్టు కార్యాకలపాలలో వాటిని వాడకూడదంటూ హైకోర్టు రిజిస్ట్రర్ జనరల్ సతీష్ కుమార్ శర్మ నోటీసులు జారీ చేశారు. ఇదే పద్దతిని దేశ వ్యాప్తంగా గల హైకోర్టులో కూడా పాటిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.