‘బాబ్రీ’ స్థానంలో మందిరాన్ని ఒప్పుకోం | Muslim litigants back Sri Sri Ravi Shankar’s efforts for out of court settlement | Sakshi
Sakshi News home page

‘బాబ్రీ’ స్థానంలో మందిరాన్ని ఒప్పుకోం

Nov 13 2018 4:27 AM | Updated on Nov 13 2018 4:27 AM

Muslim litigants back Sri Sri Ravi Shankar’s efforts for out of court settlement - Sakshi

అయోధ్య/లక్నో: బాబ్రీమసీదు–రామమందిరం వివాద పరిష్కారానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ చేస్తున్న ప్రయత్నాలను ఈ కేసులో కక్షిదారైన హాజీ మహబూబ్‌ స్వాగతించారు. కోర్టు బయట వివాదం పరిష్కారమయితే శాంతి, సామరస్య పరిస్థితులు ఏర్పడతాయన్నారు. అయితే బాబ్రీ మసీదు స్థానంలో మరే కట్టడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. ‘అయోధ్య వివాదం ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా, శాంతియుతంగా పరిష్కారమయితే మంచింది. దీనివల్ల హిందూ–ముస్లిం మతస్తుల మధ్య దీర్ఘకాల శాంతి, సామరస్యం నెలకొంటుంది. ఇందుకోసం ప్రయత్నిస్తున్న శ్రీశ్రీ రవిశంకర్‌కు మేం సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. అయితే మసీదు ఎప్పటికీ మసీదుగానే ఉంటుంది. బాబ్రీమసీదుకు సంబంధంలేని స్థలంలో రామమందిరం కట్టుకుంటే మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం’ అని హాజీ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement