
మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కార్ అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతుందన్న ఆ పార్టీ నేత పీసీ శర్మ
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌పై ఆ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు బావుటా ఎగరవేసిన క్రమంలో పెను సంక్షోభం నెలకొంది. సింధియాకు మద్దతిస్తున్న 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూర్‌లో మకాం వేశారు. కాగా కమల్‌నాథ్ సర్కార్‌కు ఎలాంటి ముప్పూలేదని, కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్ల పరిపాలనను పూర్తిచేస్తుందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత పీసీ శర్మ స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చలు జరుగుతున్నాయని తమ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు మధ్యప్రదేశ్‌లో పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభంపై పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ పలువురు పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక జ్యోతిరాదిత్య సింధియా హోంమంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సింధియా సహకరిస్తారని భావిస్తున్నారు.