కరుణానిధి భార్య, కుమార్తెకు బెయిల్ | money laundering case: Raja, Kanimozhi, Dayalu Ammal get bail | Sakshi
Sakshi News home page

కరుణానిధి భార్య, కుమార్తెకు బెయిల్

Aug 20 2014 10:12 PM | Updated on Sep 2 2017 12:10 PM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భార్య దయాళు అమ్మల్, కుమార్తె కనిమొళికి తాత్కాలిక ఉపశమనం లభించింది.


న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భార్య దయాళు అమ్మల్,  కుమార్తె కనిమొళికి తాత్కాలిక ఉపశమనం లభించింది. స్పెక్ట్రం కుంభకోణం సంబంధించి మనీలాండరింగ్ కేసులో దయాళు అమ్మల్, కనిమొళితో పాటు కేంద్ర మాజీ మంత్రి రాజా, ఇతరులకు బెయిల్ దక్కింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

ఒక్కొక్కరితో ఐదు లక్షల వ్యక్తిగత పూచికత్తు బాండు, అంతే మొత్తాలకు మరో ఇద్దరితో షూరిటీ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా కేసు నుంచి విముక్తి కల్పించాలన్న అమ్మల్ అభ్యర్థను తోసిపుచ్చింది. వీరిందరిపై ఈడీ కేసులు నమోదు చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement