ఎన్నికల కమిషన్ కు క్రికెటర్ మహ్మద్ కైఫ్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.
మహ్మద్ కైఫ్ ఆస్తులు 10 కోట్లు
Apr 15 2014 9:49 PM | Updated on Aug 14 2018 4:21 PM
అలహాబాద్: ఎన్నికల కమిషన్ కు క్రికెటర్ మహ్మద్ కైఫ్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. క్రికెటర్ కైఫ్ తొలిసారి ఉత్తర ప్రదేశ్ లోని ఫుల్పుర్ లోకసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. తన పేరిట 10.4 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఎన్నికల కమిషన్ కు దాఖలు చేసిన అఫిడవిట్ లో తెలిపారు. కైఫ్ భార్య పూజా యాదవ్ పేరిట 99.7 లక్షల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్ కు సమర్పించిన ఆస్తుల వివరాల్లో నాలుగు కార్లు, ఖరీదైన ఆడీ కారు, 6.48 లక్షల పెట్టి కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి(ప్రస్తుతం 20 లక్షలు), ఆలహాబాద్, నోయిడాలో రెండు నివాసాలు, గుర్గావ్ లో ఓ ఫ్లాట్ విలువ 7.03 కోట్లు అని అఫిడవిట్ లో పేర్కొన్నారు.
Advertisement
Advertisement