అర్జెంటీనాకు మోదీ | Modi to visit Argentina for G20 Summit on Nov 28 | Sakshi
Sakshi News home page

అర్జెంటీనాకు మోదీ

Nov 29 2018 4:41 AM | Updated on Nov 29 2018 4:41 AM

Modi to visit Argentina for G20 Summit on Nov 28 - Sakshi

న్యూఢిల్లీ: జీ–20 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌కు బయల్దేరారు. ఈ పర్యటనలో మోదీ పలువురు దేశాధినేతలతో భేటీ కానున్నారు. జపాన్‌ ప్రధాని షింజో అబే, మోదీతో కలసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ త్రైపాక్షిక సమావేశంలో పాల్గొంటారని శ్వేతసౌధం ప్రకటించింది. ఈ సమావేశం నవంబర్‌ 30 లేదా డిసెంబర్‌ 1న జరిగే అవకాశాలున్నాయి. త్రైపాక్షిక భేటీకి ముందు, ట్రంప్‌–అబేల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ముగ్గు రి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. జీ–20 సదస్సు సందర్భంగా ట్రంప్‌–చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ట్రంప్‌–రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ల మధ్య జరిగే సమావేశాలపైనే అందరి దృష్టి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement