యూపీ చుట్టూ మోదీ చక్కర్లు | Modi to visit UP twice in April | Sakshi
Sakshi News home page

యూపీ చుట్టూ మోదీ చక్కర్లు

Mar 15 2016 10:42 AM | Updated on Aug 15 2018 2:20 PM

యూపీ చుట్టూ మోదీ చక్కర్లు - Sakshi

యూపీ చుట్టూ మోదీ చక్కర్లు

వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లో రెండుసార్లు పర్యటించనున్నారు.

లక్నో: వచ్చే నెలలో ఉత్తరప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ రెండుసార్లు పర్యటించనున్నారు. బీజేపీ రాష్ట్ర యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నట్టు మంగళవారం ఆ పార్టీ వర్గాలు అధికారకంగా వెల్లడించాయి. ఏప్రిల్ 14న రాజ్యంగ పితామహుడు, దళితులకు స్పూర్తిప్రధాత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అంబేద్కర్ జన్మదిన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొనున్నారు.

అంబేద్కర్ జన్మదినం నుంచి మొదలుకుని ఈ కార్యక్రమాలు ఏప్రిల్ 24 అగ్రాలో జరిగే కార్యక్రమంతో ముగుస్తాయని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పట్నాయక్ మీడియాకు తెలిపారు. 2014 ఎన్నికల అనంతరం రాజకీయంగా ఎదురుదెబ్బలు తగలడంతో దళితుల ఓట్లు చేజారియే ప్రమాదం ఉందని భావించిన బీజేపీ.. 2017 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా  పార్టీ ప్రచారం జోరుగా నిర్వహించాలని యోచిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement